జనగామ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీకి న్యాయవాది సునీత ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా మసీదు నిర్మాణం చేపట్టడంతో కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని.. అయినప్పటికీ పనులు నడుస్తుడడంతో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. దీనితో కలెక్టర్ ఇరువర్గాలను పిలిచి చర్చించారని, అనుమతులు లేకుండా మసీదు నిర్మాణం చేయవద్దని చెప్పడంతో నిర్మాణం నిలిచిపోయిందన్నారు.
ఈ విషయమై ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, వస్తే బాగుండదని, కాలనీ వాసులతో కనిపిస్తే అంతు చూస్తా అని ఎమ్మెల్యే బెదిరించారని ఆమె వాపోయారు. అయితే లాయర్ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. తాను ఎవరిని క్యాంపు కార్యాలయానికి పిలువలేదని, కాలనీ వాసులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకుంటుంటే వారించాను అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి తెలిపారు. మత పరమైన అంశమైనందున తనేమి చేయలేనని తెలిపినట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: పెరుగుతున్న కొవిడ్ మరణాలతో అంత్యక్రియలకు ఇబ్బందులు!