భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద 200 కేజీల గంజాయి(GANJA SEIZED)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.40లక్షలు ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
నిందితులు సమదాన్, విక్రమ్, గణేష్ మహారాష్ట్ర ఒస్మానాబాద్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కారుతో పాటు గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో 24 గంటలూ తనిఖీలు జరుగుతుంటాయని తెలిపారు. నిషేధిత వస్తువులను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టి.స్వామి, ఎస్.మధు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: CORONA: కరోనా వేళ తైలాల పేరుతో రూ.52 లక్షల మోసం