ETV Bharat / crime

లాక్​డౌన్​ వేళ... ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను - telangana news udpates

లాక్​డౌన్​ వేళ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఇదే అదునుగా భావించి.. విలువైన భూములపై కన్ను వేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్​బషీరాబాద్​ క్వారీపై కొందరి కన్ను పడింది. దీనిపై వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Occupiers
Occupiers
author img

By

Published : May 19, 2021, 7:58 PM IST

కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కబ్జాదారులు ఇదే అదునుగా విలువైన భూములను కబ్జా చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్​బషీరాబాద్​లోని సర్వే నంబర్ 25/1 లో అతి పెద్ద క్వారీ ఉంది. దీనిని కొద్ది రోజుల నుంచి కొందరు కబ్జా చేసేందుకు ఆ క్వారీలో మట్టి, రాళ్లతో నింపుతున్నారు.

గమనించిన వీఆర్వో బాలరాజు.. కబ్జాదారులను హెచ్చరించారు. అయినా అదే పనిగా కొనసాగిస్తుండగా... కొండయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, నర్సింహ, కృష్ణ అనే ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ.. వీఆర్వో స్థానిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు వీఆర్వో బాలరాజుతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు. విషయం జిల్లా రెవెన్యూ అధికారులకు తెలియడంతో నేడు కీసర ఆర్డీవో రవికుమార్, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి ఆ భూములను పరిశీలించారు. అది ప్రభుత్వ స్థలమని అందులో ఎవరైనా ఆక్రమించడానికి యత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.

ఇవీ చూడండి: కొవిడ్‌ టీకాల సరఫరాకు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.