ETV Bharat / crime

Land Dispute Fight Live Video: భూ తగాదాలతో రెండు వర్గాల ఘర్షణ.. వీడియో వైరల్

Land Dispute Fight Live Video: భూతగాదాలతో రెండు వర్గాలు విచక్షణారహితంగా దాడి చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. మహిళలు కూడా జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. అనంతరం ఇరు వర్గాలు పోలీసుల వద్ద పరస్పరం ఫిర్యాదులు చేశారు.

Land Dispute Fight Live Video
Land Dispute Fight Live Video
author img

By

Published : Mar 17, 2022, 12:35 PM IST

Land Dispute Fight Live Video: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో భూ వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది వంశపారంపర్యంగా వచ్చిన భూమి.... 'మాదంటే మాదంటూ' దాయాదులు పరస్పరం దాడికి దిగారు. మున్సిపాలిటీ శివారులోని కుర్మపల్లిలో 4 ఎకరాల భూమి కోసం విచక్షణా రహితంగా కొట్టుకున్నారు.

Land Dispute Fight in Mancherial : కడారి భీమన్న అనే వ్యక్తికి చెందిన వారసుల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ భూ వివాదం కోర్టులో కొనసాగుతోంది. బుధవారం రోజున ఓ వర్గం భూ ఆక్రమణకు ప్రయత్నించగా వారిని అడ్డుకునేందుకు మరో వర్గం వెళ్లింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. వీరంతా జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.

పరస్పర దాడి అనంతరం ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న రామకృష్ణాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భూ తగాదాలతో రెండు వర్గాల ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.