సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై ఆసుపత్రిలో పనిచేసే టెక్నీషియన్ అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఈనెల 10న రాత్రి సమయంలో నొప్పులు రావడంతో కోదాడలోని తిరుమల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొవిడ్ పరీక్ష చేయాలంటూ టెక్నీషియన్ శ్రీకాంత్ పరీక్ష గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. సదురు మహిళ కేకలు వేయడంతో వెంట వచ్చిన బంధువులు ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్‌ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గర్భిణిని ప్రసవం కోసం మరో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై ఆసుపత్రి టెక్నీషియన్ ఇలా ప్రవర్తించడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుందని మహిళ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో కోదాడ డీఎస్పీ రఘు దర్యాప్తు చేస్తున్నారు..ఈ వ్యవహారంలో నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి కల్పించుకొని కేసును తారుమారు అయ్యే విధంగా చూస్తున్నట్లు సమాచారం. గర్భిణికి న్యాయం చేయాలంటూ మహిళ సంఘాలు కోరుతున్నాయి. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు.
ఇదీ చదవండి: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య