ETV Bharat / crime

constable rape attempt: బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం - కానిస్టేబుల్ శేఖర్

ConstabConstable attempted to rape a girlle
అత్యాచారయత్నం చేసిన కూకట్‌పల్లి కానిస్టేబుల్‌ శేఖర్‌
author img

By

Published : Dec 1, 2021, 4:51 PM IST

Updated : Dec 2, 2021, 10:41 AM IST

16:49 December 01

constable rape attempt: బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం

రక్షించాల్సిన పోలీసు అధికారే.. రాక్షసుడిలా మారాడు. అభం శుభం తెలియని బాలికపై కీచకుడిలా మారి అఘాయిత్యం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో ఇరుపొరుగు వారు వచ్చి ఆమెను కాపాడారు. లైంగిక దాడికి యత్నించిన పోలీసు కానిస్టేబుల్​ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

శంకర్పల్లి పట్టణానికి చెందిన శేఖర్‌ (35) నగరంలోని కూకట్‌పల్లి ఠాణాలో కానిస్టేబుల్‌. అతడి ఇంట్లో కొంత కాలంగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. బుధవారం సదరు కుటుంబానికి చెందిన బాలిక(15) ఇంట్లో ఒంటరిగా ఉంది. గమనించిన కానిస్టేబుల్‌ బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించగా...కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి :

Inter Student Suicide: ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

Last Updated : Dec 2, 2021, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.