గుడుంబా తయారీకి తరలిస్తున్న బెల్లాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలో కొన్ని రోజులుగా గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. ప్రతిరోజు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం ఎడ్లపల్లి క్రాస్ రోడ్ వద్ద విశ్వసనీయ సమాచారంతో.. కొయ్యూరు గ్రామానికి చెందిన వేల్పుల రాజేందర్ తన ఇండికా కారులో సుమారు 15 కాటన్ల బెల్లం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ బెల్లాన్ని మంచిర్యాల నుంచి మంథని మీదుగా రవాణా చేస్తున్నాడని.. గుడుంబా తయారీకి తీసుకెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
కొయ్యూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో కొయ్యూరు పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సీఐ ప్రశాంతి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: టోల్‌ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు