గుర్రంబోడు తండాలోని భాజపా గిరిజన రైతు భరోసా యాత్రలో పోలీసులపై దాడులకు పరోక్షంగా... కారణమైన సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డిని కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ బై పాస్ వద్ద భాగ్యరెడ్డి టీ తాగితున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరితో పాటు హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలువురు భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడకు చెందిన భాజపా రాష్ట్ర నాయకుడు ఓర్సు వేలంగిరాజును సైతం పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 101 కరోనా కేసులు.. ఒకరు మృతి