వరుసకు బావ అయ్యే అబ్బాయితో 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్నాన్ని... కీసర పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలుకు చెందిన చిన్న కొండయ్య అనే యువకుడు... అతని తండ్రి మరణించడంతో తల్లితో కలిసి కీసర మండలం నాగారం రాఘవేంద్రకాలనీలో నివాసం ఉంటున్నాడు. అక్కడే స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
చర్లపల్లిలో నివాసం ఉంటున్న కొండయ్య దంపతులు తమ పదహారేళ్ల కూతురును... చిన్న కొండయ్యకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. ఇవాళ రాఘవేంద్రనగర్ కాలనీలోని అబ్బాయి ఇంటి వద్ద ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్లో కరోనా.. అంకెల్లో ఇలా...