ETV Bharat / crime

చిన్నారిని ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి... - కరీంనగర్ జిల్లా తాజా నేర వార్తలు

road accident: తల్లిని చూసేందుకు బయలుదేరిన ఓ చిన్నారిని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దగ్గరే కదా అని రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తుండగా విధి వక్రించింది. కారుపై నియంత్రణ కోల్పోయిన ఓ డ్రైవర్​ చిన్నారిని ఢీ కొట్టాడు. ఆ వేగానికి ఆ చిన్నారి గాల్లోకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

రోడ్డుప్రమాదం
రోడ్డుప్రమాదం
author img

By

Published : Jul 8, 2022, 9:50 PM IST

Updated : Jul 9, 2022, 8:29 AM IST

చిన్నారిని ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి...

road accident: అప్పటి వరకు ఆ చిన్నారి ఇంట్లోనే ఆడుకుంది... సమీపంలో పనిచేస్తున్న తల్లి వద్దకు బయలుదేరింది. అంతలోనే కారు రూపంలో మృత్యువు ఆ బాలికను బలిగొంది. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన లోకిని జంపయ్య, రాజేశ్వరి దంపతులు తిమ్మాపూర్‌ రాజీవ్‌ రహదారి పక్కనే ఓ ఇంట్లో నివసిస్తున్నారు. రాజేశ్వరి రహదారి పక్కన ఉన్న ఓ సంచార హోటల్‌లో పనిచేస్తోంది. అయిదో తరగతి పూర్తి చేసిన వారి కుమార్తె శివాని (10)ని ఆరో తరగతిలో చేర్చేందుకు ఆ దంపతులు ప్రయత్నిస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం తల్లి పనిచేసే చోటకు వెళ్దామని శివాని ఇంటి నుంచి బయలుదేరింది. రోడ్డుకు ఎడమవైపునే నడుస్తూ వెళ్తుండగా.. సంతోష్‌కుమార్‌ అనే వ్యక్తి కారును అతివేగంగా నడుపుతూ వెనుక నుంచి శివానిని ఢీకొట్టాడు. ఆ ధాటికి చిన్నారి గాల్లో సుమారు 30 మీటర్ల మేర ఎగిరి పడింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌ రెడ్డి తెలిపారు. కారులో ఉన్న ముగ్గురూ మద్యం తాగి ఉన్నారని, ప్రమాదం తర్వాత కూడా సమీపంలోని వైన్స్‌కు వెళ్లి మద్యం తాగి పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.

గాల్లో ఎగిరి పడుతున్న చిన్నారి

ఇదీ చదవండి: లోన్​యాప్స్‌ వేధింపులకు మరో యువకుడు బలి

స్కూల్​కు తల్వార్​తో విద్యార్థి తండ్రి.. యూనిఫాం డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటూ...

Last Updated : Jul 9, 2022, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.