ETV Bharat / crime

23 మంది భాజపా నాయకులు జ్యుడీషియల్ రిమాండ్​కి తరలింపు - భాజపా తాజా సమాచారం

Judicial remand to BJP leaders: తెరాస, భాజపా శ్రేణుల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో భాగంగా.. ఎల్లారెడ్డిపేట పోలీసులు సుమారు 23 మంది భాజపా నాయకులను శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. వీరిని జ్యుడీషియల్ రిమాండ్​కి తరలించారు.

Judicial remand to BJP leaders
భాజపా నాయకులకి జ్యుడీషియల్ రిమాండ్​
author img

By

Published : Mar 20, 2022, 11:46 AM IST

Judicial remand to BJP leaders: తెరాస, భాజపా నాయకుల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో భాగంగా... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 23 మంది భాజపా నాయకులను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.

జ్యుడీషియల్ మేజిస్ట్రేటు ముందు హాజరు..

అనంతరం పోలీసులు వీరిని.. సిరిసిల్ల ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు ముందు హాజరు పరిచారు. అరెస్టు అయిన వారిని విచారించిన న్యాయమూర్తి... పోలీసులు సరైన నిబంధనలు పాటించకపోవడంతో రిమాండ్ నిరాకరించారు. అనంతరం సరైన నిబంధనలు పాటిస్తూ.. శనివారం అర్ధరాత్రి భాజపా నాయకులను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

అసలేం జరిగిందంటే..

Yellareddypet attack case: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బోనాల సాయి ఉపాధి నిమిత్తం వలస వెళ్లాడు. అయితే అతను సామాజిక మాధ్యమాల్లో తెరాసకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనే ఉద్దేశంతో అతని ఇంటికి కొంత మంది తెరాస కార్యకర్తలు వెళ్లారు. ఈ విషయం తల్లి తన కొడుకు దృష్టికి తీసుకురాగా బోనాల సాయి పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో పాటు కొంతమంది కార్యకర్తలు పోలీస్‌స్టేషన్​కు రావడంతో ఘర్షణ చోటు చేసుకొంది.

ఎల్లారెడ్డిపేట దాడి కేసులో భాజపా నాయకులు రిమాండ్​కి తరలింపు

ఇదీ చదవండి:BJP Vs TRS: భాజపా, తెరాస నాయకుల పరస్పర దాడి.. ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.