ETV Bharat / crime

Job Fraud Gang Arrest: ఉద్యోగాల పేరుతో కోటిన్నర వసూల్... ముఠా అరెస్ట్

Job Fraud Gang Arrest: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్​ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మంది బాధితుల నుంచి సుమారు రూ.కోటిన్నర వసూలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.

rachakonda
rachakonda
author img

By

Published : Jan 25, 2022, 4:47 PM IST

Job Fraud Gang Arrest: హైదరాబాద్‌లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 15 మంది నుంచి సుమారు రూ. కోటిన్నర వసూలు చేశారని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. రైల్వే , మెట్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి... మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. కేటుగాళ్ల చేతిలో మోసపోయామని గుర్తించిన బాధితులు మేడిపల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ముఠా సభ్యుల్లో ముగ్గురు చేసినట్లు సీపీ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి సురేంద్ర.. గుంటూర్ వాసి అని చెప్పిన సీపీ... ఆయనపై గతంలోనూ కేసులున్నాయని భగవత్‌ వివరించారు. మోసం చేసిన డబ్బులతో సురేంద్ర స్థిరాస్తులు, కార్లు కొన్నారని పేర్కొన్నారు. ఉప్పల్‌లో ఇల్లు, హోటల్, 4 కార్లు కొన్నట్లు సురేంద్ర ఒప్పుకున్నాడని సీపీ వివరించారు.

ముఠా ప్రధాన సూత్రధారి సురేంద్ర గుంటూరు వాసి. మోసం చేసిన డబ్బులతో సురేంద్ర స్థిరాస్తులు, కార్లు కొన్నారు. ఉప్పల్‌లో ఇల్లు, హోటల్, 4 కార్లు కొన్నట్లు సురేంద్ర ఒప్పుకున్నాడు. గతంలోనూ సురేంద్రపై కేసులు ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌లో మకాం వేశాడు. సుమారు 15 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

-- మహేశ్​ భగవత్, రాచకొండ సీపీ

ఉద్యోగాల పేరుతో కోటిన్నర వసూల్... ముఠా అరెస్ట్

ఇదీ చదవండి: గంజాయి ముఠా బీభత్సం.. కారు వదిలేసి చెరువులో దూకిన స్మగ్లర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.