ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు నైజీరియన్లను బెంగళూరు బాణసవాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు. ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని, శుక్రవారం ఆ కేసులో అబుజి ఉబాకా, టోనీలను నిందితులుగా గుర్తించామని దర్యాప్తు అధికారులు వివరించారు.
తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. నైజీరియన్ రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Gang Rape : పశువుల పాకలో బాలికపై సామూహిక అత్యాచారం.. అక్కడి నుంచి తీసుకెళ్లి...