ETV Bharat / crime

కాబోయే భర్తను కట్టేసి.. యువతిపై అత్యాచారం కేసులో దర్యాప్తు వేగవంతం

ఆంధ్రప్రదేశ్​లోని తాడేపల్లి అత్యాచార ఘటనలో.. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సెల్‌ఫోన్ సిగ్నళ్లు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల వేట కొనసాగిస్తున్నారు. కొందరు అనుమానితుల ఫొటోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని మహిళా మంత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. ఏపీ ప్రభుత్వం ఆమెకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది.

investigation-into-thadepalli-rape-case-expedited
తాడేపల్లి అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం
author img

By

Published : Jun 22, 2021, 10:41 AM IST

తాడేపల్లి అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం

ఏపీలోని తాడేపల్లి అత్యాచార ఘటనను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కిలోమీటరన్నర దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌తో పాటు విజయవాడ కమిషనరేట్‌ పోలీసులు తాడేపల్లి వచ్చి కేసు దర్యాప్తు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ, కుంచనపల్లి, నులకపేట, మహానాడు రోడ్డులో క్షేత్రస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పుష్కరఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు సేకరిస్తున్నారు. అనుమానితుల జాబితాను తయారుచేసి విచారిస్తున్నారు. కొందరు అనుమానితుల ఫోన్లకు పోలీసులు ప్రయత్నించగా..... వాటి టవర్ లొకేషన్లు బాధిత యువతి చికిత్స పొందుతున్న గుంటూరు జీజీహెచ్​ పరిసరాల్లోనే ఉండటంతో ఆఘమేఘాలపై పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా...ఆ ఫోన్లు వేరేవాళ్లు వినియోగిస్తున్నట్లు తేలింది.

అదుపులోకి నిందితులు

ఘటనకు పాల్పడిన వారిలో ఐదారుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యాచారానికి పాల్పడింది మాత్రం ఇద్దరేనని ప్రాథమికంగా తేల్చారు. వీరికి మిగిలిన వారు సాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రోజు బాధితులు అర్ధరాత్రి 12 గంటలకు ప్రకాశం బ్యారేజి వద్ద ఉన్న పోలీసు అవుట్‌పోస్టు వద్దకు చేరుకుని తమ బంగారు ఆభరణాలు కొందరు దోచుకెళ్లారని ఫిర్యాదు చేశారు. గస్తీ విధుల్లో ఉన్న మహిళా ఎస్సై సిబ్బందితో కలిసి అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా... కొందరు పడవలో విజయవాడ వైపు పారిపోతున్నట్లు గమనించారు. వారు వెంటనే తేరుకుని బ్యారేజీ మీద నుంచి విజయవాడ రాగా...అప్పటికే వారు పడవ వదలేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

పటిష్ఠ బందోబస్తు..

తాడేపల్లి అత్యాచార ఘటనతో అప్రమత్తమైన పోలీసులు... సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం, సీసాలు, చెత్తతో అపరిశుభ్రంగా ఉన్న ఘాట్ పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. రాత్రిళ్లు కూడా విద్యుత్‌దీపాలు వెలిగేలా మరమ్మతులు చేయిస్తున్నారు. చీకటి పడ్డాక సేదతీరేందుకు వచ్చే వారిని నిలువరించేందుకు... మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు.

బాధితురాలికి ఆర్థిక సాయం...

బాధిత యువతిని మహిళా మంత్రులు సుచరిత, తానేటి వనితతోపాటు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితురాలికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. తక్షణ సాయం కింద 50 వేల రూపాయలు అందజేశారు. ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

ఇదీ చదవండి: కాబోయే భర్తను కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.