ETV Bharat / crime

Remand to drug peddler Tony : అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి 14 రోజుల రిమాండ్ - తెలంగాణ నేర వార్తలు

Remand to drug peddler Tony : అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. డ్రగ్స్ కేసులో టోనీ సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. టోనీ సహా 10 మందికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Remand to drug peddler Tony, telangana drugs case
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి 14 రోజుల రిమాండ్
author img

By

Published : Jan 21, 2022, 3:34 PM IST

Updated : Jan 21, 2022, 4:41 PM IST

Remand to drug peddler Tony : మాదక ద్రవ్యాల కేసులో 10 మంది నిందితులను పోలీసులు చంచల్​గూడ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు నైజీరియాకు చెందిన టోనీతో పాటు... డ్రగ్స్ వినియోగిస్తున్న ఏడుగురు వ్యాపారులను, ఇద్దరు డ్రైవర్లను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులందరికీ న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది.

వ్యాపారవేత్తలూ అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసులు ముంబయిలో టోనీని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్​కు చెందిన పలువురు బడా వ్యాపారవేత్తలను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిరంజన్ కుమార్ జైన్, శాశ్వత్ జైన్, యాగ్యానంద్, సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, సాగర్​తో పాటు... ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యాపారులు పరారీలో ఉన్నారు. ఈ నలుగురు కూడా టోనీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి... వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వివిధ రాష్ట్రాల్లో ఏజెంట్ల ద్వారా దందా

టోనీని పోలీసు కస్టడీ కోరే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకొని టోనీ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారు స్టార్ బాయ్ నుంచి డ్రగ్స్ తీసుకొని, ఎక్కువ ధరకు విక్రయించి టోనీ డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టోనీని కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వ్యాపారులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. నిందితులు పలు పార్టీలు నిర్వహించారని... ఈ పార్టీల్లో డ్రగ్స్ ఏమైనా సరఫరా చేశారా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

బతుకుదెరువు కోసం వచ్చి..

నైజీరియాకు చెందిన టోనీ అసలుపేరు చుక్వు ఒబ్గొన్నా డేవిడ్. 12వ తరగతి వరకూ చదివి బతుకుదెరువు కోసం వ్యాపారవీసాపై ముంబయికి వచ్చాడు. నైజీరియన్లు ఎక్కువగా ఉండే అంధేరి ప్రాంతంలో నివాసముంటూ.. అక్కడి వారితో స్నేహం పెంచుకున్నాడు. మీరా భాండియార్‌, వాసైవిరార్‌లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. కొంతమంది డ్రగ్స్‌ దందా నడుపుతుండగా అదేబాటపట్టాడు.

చిక్కకకుండా జాగ్రత్తపడుతూ దందా

దేశంలోని ప్రధాన నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని.. 2017 నుంచి డ్రగ్స్‌ సరఫరాదారుడి అవతారమెత్తాడు. చిరునామా ఎవరికీ చిక్కకుండా జాగ్రత్తపడుతూ ఇంటర్నెట్‌ కాల్స్‌ ద్వారానే దందా నడుపుతున్న టోనీని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆటకట్టించారు. నగరంలో 15 నుంచి 20 మంది ఏజెంట్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. వాళ్ల దగ్గర 13 మంది ప్రముఖులు మత్తుపదార్ధాలు కొన్నట్లు తేల్చారు. 9మందిని అరెస్టు చేయగా.. ఏడుగురు నిందితులు 100కోట్లకు పైగా వ్యాపారాలు కలిగిన సంపన్నులని నిర్ధారించారు.

ఏం జరిగింది?

రాష్ట్రంలో మత్తుమందులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాడకందారులు పెరగడంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు రాష్ట్రంపై కన్నేశాయి. తన ఉనికి బయటపడకుండా దేశవ్యాప్తంగా డ్రగ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న టోనీతో పాటు మరికొందరిని హైదరాబాద్‌ పోలీసులు తాజాగా అరెస్టు చేయడంతో మరోమారు డ్రగ్స్‌ తుట్టె కదిలింది. గత ఏడాది రాష్ట్రంలో దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకోగా, పట్టుబడకుండా వినియోగదారులకు చేరింది ఇంతకు నాలుగైదు రెట్లు ఉంటుందన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి.

2013లో తాత్కాలిక వీసాపై ముంబయికి వచ్చిన టోనీ.. వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటూ డ్రగ్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. టోనీకి స్టార్‌య్ అనే అంతర్జాతీయ డీలర్.. ఓడల ద్వారా సరుకు పంపిస్తున్నట్లు గుర్తించాం. వాటిని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నాడు. నగరంలో 13 మంది ప్రముఖులకు ఈ డ్రగ్స్‌ను విక్రయించారు. రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసే నిరంజన్ జైన్‌ సైతం డ్రగ్స్ తీసుకున్నారు. నిరంజన్‌ జైన్ 30 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. చాకచక్యంగా వ్యవహరించి టోనీతో పాటు 9 మందిని అరెస్టు చేశాం.

- సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ సీపీ

రసాయన మాదకద్రవ్యాల ఉత్పత్తికీ హైదరాబాద్‌ స్థావరంగా మారింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో 2020 డిసెంబరు నెలలో డీఆర్‌ఐ అధికారులు ఇలాంటి కర్మాగారాన్ని కనుగొని మూడువేల కిలోలకు పైగా మెఫెడ్రన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి :

Last Updated : Jan 21, 2022, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.