ETV Bharat / crime

Inter Student Suicide in Hyderabad : చదువుకోమని చెప్పినందుకు విద్యార్థి ఆత్మహత్య - ఇంటర్ విద్యార్థి సూసైడ్

Inter Student Suicide in Hyderabad
Inter Student Suicide in Hyderabad
author img

By

Published : Jan 24, 2022, 12:34 PM IST

Updated : Jan 24, 2022, 1:21 PM IST

12:32 January 24

Inter Student Suicide in Hyderabad : చదువుకోమని చెప్పినందుకు విద్యార్థి ఆత్మహత్య

Inter Student Suicide in Hyderabad : చదవుకోమని తల్లి చెప్పిందని క్షణికావేశంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​ సనత్​నగర్​లో చోటుచేసుకుంది. సనత్​నగర్​కు చెందిన రాహుల్​(16)ను.. బయట తిరగవద్దని.. చదువుకోవాలని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంటి పైఅంతస్తుకు వెళ్లి ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Inter Student Suicide at Sanath Nagar: బోరబండ రాధాకృష్ణనగర్‌లో పదేళ్ల నుంచి చాపల ప్రమీల.. భర్తతో విడిపోయి నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు చాపల రాహుల్ ఉన్నాడు. కుమారుడు రాహుల్ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొంత కాలంగా రాహుల్ చదువుకోకుండా బయట ఎక్కువగా తిరుగుతుండడంతో తల్లి ప్రమీల మందలించింది. తల్లి మందలింపుతో మనస్తాపానికి గురైన రాహుల్ ఇంటి అంతస్తులోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు.

గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బయట అల్లరిచిల్లరగా తిరుగుతూ జీవితం పాడుచేసుకుంటున్నాడని.. బుద్ధిగా చదువుకోవాలని చెప్పినందుకు ఇంత పని చేశాడని తల్లి ప్రమీల వాపోయింది. చేతికందొచ్చిన కొడుకు విగతజీవిగా పడిఉండటం చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 24, 2022, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.