ETV Bharat / crime

బీమా పాలసీల పేరుతో కోట్లు స్వాహా.. బయటపడుతున్న ఏజెంట్ల బాగోతాలు.. ఎలా దొరికిపోయారంటే..?

Insurance Policy Fraud Case: వాళ్లు ముగ్గురు ఇన్సూరెన్స్​ ఏజెంట్లు. వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే వాళ్ల టార్గెట్​. మాటలతో మాయ చేసి కోట్ల రూపాయల పాలసీలు చేయించటం వాళ్ల టాలెంట్​. ఇంకేముంది.. పాలసీల పేరుతో కోట్లు నొక్కేసి.. వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. కాజేసిన కాసుల్లో మునిగి తేలుతున్న ఆ ఏజెంట్లు.. బాధితుల కుమారులకు వచ్చిన చిన్న అనుమానంతో కటకటాల పాలయ్యారు. విచారణలో బయటపడుతున్న వాళ్ల బాగోతాలు ఊహాతీతం.. ఆడిన ఆటలు వర్ణాతీతం.. ఇంత చేసి ఆ మాయగాళ్లు ఎలా దొరికిపోయారంటే..?

Insurance Policy agents Frauds in crores and coming out one by one in hyderabad

author img

By

Published : Apr 1, 2022, 9:54 PM IST

Insurance Policy Fraud Case: విశ్రాంత అధికారులు, వయోధికులే లక్ష్యంగా బీమా ఏజెంట్లు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వారి మాటల మాయాజాలంతో కోట్లకుకోట్లే కాజేసి.. జల్సాలు చేసిన బాగోతాలు బయటడుతున్నాయి. తమ వద్ద బీమా పాలసీలు చేస్తే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ.. నమ్మించి మోసాలకు పాల్పడిన ముగ్గురు ఇన్సూరెన్స్​ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి బాధితులు ఒక్కొక్కరిగా బయటకువస్తున్నారు. మార్చి 24న ఓ బాధితుడు ఇచ్చి ఫిర్యాదులో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో పోలీసులు.. సుబ్రహ్మణ్యం, మనోజ్​, మహేశ్​గౌడ్​ అనే ముగ్గురు ఇన్సూరెన్స్​ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

కుమారులకు వచ్చిన అనుమానంతో వెలుగులోకి..: హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసముంటున్న ప్రభుత్వ విశ్రాంత అధికారి కె.జగపతిరావు(74)కు ఇద్దరు కుమారులు. ఇద్దరు లండన్​లో స్థిరపడ్డారు. కాగా.. వాళ్ల సంపాదనను తండ్రి జగపతిరావుకు పంపించేవారు. అయితే.. తమ తండ్రి అకౌంట్​ని చెక్​ చేయగా అందులో నగదు చాలా తక్కువగా ఉంది. ఏమైందిని వెంటనే.. తండ్రికి ఫోన్​ చేసి ఆరా తీశారు. బీమా పాలసీలు చేశానని తండ్రి చెప్పాడు. కట్టిన పాలసీలకు సంబంధించిన రశీదులు పరిశీలించగా ఏజెంట్లు మోసం చేసినట్టు అర్థమైంది. మోసపోయినట్టు తెలుసుకున్న జగపతిరావు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న సెంట్రల్​క్రైం పోలీసులు.. ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణ చేయగా.. కేవలం జగపతిరావు నుంచి రెండేళ్లలో రూ.4.94 కోట్లు కొట్టగొట్టినట్టు తేలింది.

అరెస్టయినట్టు వార్తలు చూసి..: ఇదిలా ఉండగా.. బోయిన్‌పల్లిలో ఓ ప్రభుత్వ విశ్రాంత అధికారి నివాసముంటున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె. కాగా.. కుమార్తె విదేశాల్లో ఉండగా.. కుమారుడు బంజారాహిల్స్‌లో ఉంటున్నాడు. పదవీవిరమణ అనంతరం వచ్చిన నగదును, కుమార్తె పంపుతున్న డబ్బును ఎక్కడైనా మదుపుచేద్దామని ఏడాదిన్నరగా అనుకుంటున్నాడు. సరిగ్గా అదేసమయంలో ఎల్​ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, భారతీ యాక్సాలైఫ్‌ ఏజెంట్‌ ఉడుతా మనోజ్‌కుమార్‌ ఆయన్ను కలిశారు. తాము ఏళ్లుగా పాలసీలు చేయిస్తున్నామని.. తమ స్నేహితుడు బండారి మహేశ్‌గౌడ్‌ మరో ప్రైవేటు కంపెనీలో బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని వివరించారు. తమ వద్ద పాలసీలు చేస్తే మంచి లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మబలికారు. తరచూ ఆయన ఇంటికి వెళ్లి అప్యాయంగా మాట్లాడి.. ముగ్గులోకి దింపారు. వాళ్లు చెప్పిన మాయమాటలను ఆయన నమ్మి.. పాలసీల కోసం 17 నెలల్లో రూ.1.60కోట్లు ఇచ్చాడు. బదులుగా పాలసీలు చేయించినట్టు రసీదులు కూడా ఇచ్చారు. తీరా.. ఈ ముగ్గురు మోసగాళ్లని.. వాళ్లని అరెస్టు చేశారని.. వార్తల్లో చూసి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వాళ్లిచ్చిన రసీదులు పరిశీలిస్తే.. అవి నకిలీవని తేలింది. ఇంకేముంది.. వారి మోసంలో మరో రూ.1.60 కోట్లు చేరాయి.

విచ్చలవిడిగా డబ్బు ఖర్చు..: అయితే.. రెండేళ్లలో విశ్రాంత ప్రభుత్వ అధికారులను మోసం చేసి కాజేసిన.. రూ.6.5కోట్లను.. ముగ్గురు నిందితులు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు దర్యాప్తులో తేలింది. విందులు, వినోదాలు, ఫైవ్​స్టార్​ హోటళ్లలో పార్టీలు, గోవా, ముంబయి, బెంగళూరు విహారయాత్రలంటూ.. ఇష్టమున్నట్టు ఖర్చుచేశారు. గోవాలో క్రుయాజ్‌ పడవల్లోనూ తిరిగారు. గతేడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఈ ముగ్గురు ఏజెంట్లు ఎక్కడికి వెళ్లినా.. విమానాల్లోనే వెళ్లేవారు. పంచతారహోటళ్లలో సూట్లు తీసుకుని ఒక్కో రోజు రూ.10లక్షలకు పైనే ఖర్చుచేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు చెప్పినట్టు తెలిసింది. ముగ్గురి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10లక్షల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంకేంత మంది బాధితులున్నారో..: ఒక్కరినే మోసం చేశారనుకున్న పోలీసులు.. ఇంకోకరి నుంచి కూడా ఫిర్యాదు రావటంతో ఇంకెంత మంది బాధితులున్నారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కోర్టు అనుమతితో ముగ్గురిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. బీమా పాలసీల పేరుతో ఈ ముగ్గురికి డబ్బులిచ్చిన వారు సీసీఎస్​లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మాటల మాయగాళ్ల ఉచ్చులో ఇంకేంత మంది పడ్డారో.. వేచి చూడాలి.

సంబంధిత కథనం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.