హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ భారీ ఇండియన్ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావిర్యాల బాహ్యవలయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఘటనలో వాహనంలోని డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. చర్లపల్లి నుంచి తిమ్మాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాలను దారి మళ్లించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రావిర్యాల, బెంగళూరు టోల్గేట్ల వద్ద వాహనాలను ఒకేదారి మీదుగా పంపిస్తున్నారు. మరోవైపు ట్రక్ భారీ పరిమాణంలో ఉండటం.. అందులో ఎల్పీజీ గ్యాస్ ఉండటంతో.. దాన్ని జాగ్రత్తగా పైకి లేపేందుకు భారీ క్రేన్లను రప్పిస్తున్నారు. ఇప్పటికే ఇండియల్ ఆయిల్ అధికారులకు సమాచారమిచ్చారు. వాళ్ల సాయంతో ట్రక్‌ను రహదారిపై నుంచి పక్కకు తీసేందుకు సమాలోచనలు చేస్తున్నారు.
తప్పిన పెను ప్రమాదం
భారీ ట్యాంకర్ కావడం అందులోనూ గ్యాస్‌తో నిండి ఉండటంతో.. వాహనదారులు భయపడ్డారు. ప్రమాదంలో అది పేలి ఉంటే.. జరిగే నష్టం ఊహించుకోవడమే కష్టం. అయినా ట్యాంకర్లో ఎలాంటి లీకేజ్ లేకపోవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: ATTACK: భూవివాదంలో గొడ్డలి, కొడవళ్లతో దాడిచేసుకొన్న అన్నదమ్ములు