పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో వరుసగా ఘటనలు జరుగుతుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజల కోసం భద్రతను పెంచారు. వారం క్రితం జరిగిన ఓ బ్యాంకు చోరీలో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా 8 బృందాలను రామగుండం కమిషనరేట్ ఏర్పాటు చేసింది.
గుంజపడుగు గ్రామబస్టాండ్కు పది అడుగుల దూరంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరగడంతో పోలీస్‌శాఖ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. గుంజపడుగు బస్టాండ్, సిరిపురం బ్యారేజ్, మంథని ప్రధాన రహదారి గుంజపడుగు గ్రామ పరిసరాల్లో నిత్యం పోలీసులు గస్తీ తిరుగుతూ.. అనుమానం ఉన్నవారిని ఆపి.. తనిఖీలు చేస్తున్నారు. ఈనెల 24న రాత్రి రూ.3.10 కోట్ల విలువైన బంగారం, నగదును బ్యాంకులోంచి దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామంలో భద్రతను పెంచారు.
- ఇదీ చూడండి : మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానానే: జీహెచ్ఎంసీ