Hawala money was seized in Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా హవాలా డబ్బు భారీగా పట్టుబడుతోంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 7కోట్ల రూపాయలకుపైగా హవాలా డబ్బు పట్టుబడింది. దీంతో ఈ డబ్బు వెనుక ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. గత నెల 29న మాసబ్‌ట్యాంక్ పరిధిలో షోయబ్ అనే వ్యక్తి వద్ద రూ.1.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌కు చెందిన షోయబ్ మాలిక్ హైదరాబాద్ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్ సూచన మేరకు అతను హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
10 రోజుల వ్యవధిలో 8కోట్లు స్వాధీనం: శుక్రవారం రాత్రి హైదరాబాద్ చంద్రాయణగుట్ట కూడలి వద్ద రెండు కార్లలో తరలిస్తున్న రూ.79 లక్షల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి పరిశీలించగా. హవాలా సొమ్ము బయటపడింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు జూబ్లిహిల్స్ పరిధిలో కార్తికేయ అనే వ్యక్తి నుంచి 50లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-70లో భారీగా హవాలా డబ్బు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న రూ.2.5 కోట్లను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు హవాలా డబ్బుగా గుర్తించి సీజ్ చేశారు.
గాంధీనగర్‌లో రూ.3.5 కోట్లు సీజ్: ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా గాంధీనగర్ పీఎస్ పరిధిలోని మ్యారియట్ హోటల్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 కార్లలో తరలిస్తున్న రూ.3.5 కోట్ల హవాలా డబ్బును సీజ్ చేశారు. రెండు కార్లను స్వాధీనం చేసుకొని.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో.. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ 10 రోజుల వ్యవధిలో 8కోట్ల హవాలా డబ్బు పోలీసులకు పట్టుబడింది.
ఇవీ చదవండి: