మంచిర్యాల జిల్లా కేంద్రంలో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కాలనీలో సలీం అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.లక్షా 30వేలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ సీఐ మహేందర్ తెలిపారు.
అనంతరం పొగాకు ఉత్పత్తులను, నిల్వచేసిన సలీమ్‌ను మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిషేధిత వస్తువులను అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై ఎప్పటికీ నిఘా ఉంచుతామని అన్నారు.
ఇదీ చూడండి: బత్తాయి రసానికి డిమాండ్.. రైతులకు లాభాల పంట