హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మే లఖన్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఇంటిపై దాడి చేసి నిందితుని నుంచి 6 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ముగ్గురు నిందితులు పారిపోయినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐ రణ్వీర్ రెడ్డితోపాటు ఎస్ఐ జగన్ పాల్గొన్నారు.