ETV Bharat / crime

Illegal Registrations: అనుమతిలేని ప్లాట్లకూ ఆమోదముద్ర.. ఓ అధికారి ఎత్తుగడ - ఆదిలాబాద్ జిల్లా వార్తలు

సర్కారు ఆదేశాలకు విరుద్ధంగా అనుమతిలేని ప్లాట్లు, లే-అవుట్లకు రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారం వివాదాస్పదమైంది. ఆదిలాబాద్‌ కార్యాలయంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు విధుల్లో లేని సమయాన్ని చూసి, ఓ కీలక అధికారి వ్యూహాత్మకంగా రిజిస్ట్రేషన్ల ఘట్టానికి తెరలేపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్‌లు లేని ప్లాట్లతో పాటు అనుమతి లేని ప్లాట్లు, లే-అవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయకూడదని డిసెంబరు 2020లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీటన్నింటినీ తోసి.. స్థిరాస్తి వ్యాపారులు కొత్త వ్యూహానికి తెరలేపి బుధవారం నాటకీయంగా తమ పనులు జరిపించుకోవటం చర్చనీయాంశమైంది.

Illegal Registrations
అక్రమ రిజిస్ట్రేషన్లు
author img

By

Published : Oct 14, 2021, 10:34 AM IST

ఆదిలాబాద్‌కు చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ ఇమ్రాన్‌ ఆరోగ్య సమస్యలపై బుధవారం సెలవుపై వెళ్లారు. మరో సబ్‌రిజిస్ట్రార్‌ చంద్రశేఖర్‌ విధుల్లో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లారు. దాంతో ఓ కీలక అధికారి చక్రం తిప్పారు. ఓ కిందిస్థాయి ఉద్యోగికి రిజిస్ట్రార్‌ బాధ్యతలను అప్పగించారు. అనుమతి లేని లే-అవుట్లకు సైతం రిజిస్ట్రేషన్లు చేసే దందాకు తెరలేపారు. బినామీ పత్రాలతో 60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు ఎవరికివారు తమ దస్త్రాలను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కోసం సాయంత్రం పోటీపడటం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసేదాకా వెళ్లింది. కానీ అప్పటికే సంబంధిత సిబ్బంది అనుకున్న రిజిస్ట్రేషన్లన్నీ చేసి వెళ్లిపోవడంతో.. అంతా సవ్యంగా జరిగినట్లు చూపించే ప్రయత్నం జరిగింది. బినామీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయడంలో అనుభవమున్న ఓ కీలక అధికారికి - మరికొందరు స్థిరాస్తి వ్యాపారుల మధ్య రూ.లక్షల్లో ఒప్పందం జరగడంతోనే అనుకూల సమయం చూసుకుని ఈ తంతుకు తెరలేపినట్లు తెలిసింది.

  • ఇదే విషయమై రిజిస్ట్రేషన్‌ చేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌ను ఫోనులో సంప్రదించగా 60 రిజిస్ట్రేషన్లు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. పత్రాలు సరిగా లేనివి ఏవైనా ఉంటే తరవాత రద్దు చేస్తామని వెల్లడించారు.
  • జిల్లా రిజిస్ట్రార్‌ ఫణీందర్‌ను సంప్రదించగా రిజిస్ట్రేషన్ల పరంగా వ్యాపారుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందన్నారు. ఇమ్రాన్‌, చంద్రశేఖర్‌ విధుల్లో లేనందున కిందిస్థాయి ఉద్యోగికి రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అక్కడ అక్రమాలు జరిగినట్లు తెలియదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని తెలిపారు.
  • కేంద్రానికి నివేదిక పంపించింది. కౌమారదశలోని బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని, ఈ సమస్య అధిగమించేందుకు బాలికలకు గుడ్డు, ఇతర పోషకాహారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని మంజూరు చేసి నిధులు ఇవ్వాలని కోరింది.
  • రాష్ట్రంలో ఐసీడీఎస్‌ కింద 149 ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం 35,573 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల నుంచి ప్రస్తుతం 21 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో జనాభా పెరిగింది. కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. నూతన మండలాలు, మండలాల్లో జనాభా గణనీయంగా పెరిగింది. దీంతో అక్కడి అంగన్‌వాడీ కేంద్రాలపై ఒత్తిడి పెరగడంతో కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో 879 కొత్త కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో ఎక్కువగా నగర, మున్సిపాలిటీల పరిధిలోనే ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశమున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చూడండి: Bar Conflict: తాగిన బిల్లు కట్టమని అడిగినందుకు దాడి

old city brutal murder: కారులోంచిలాగి కత్తులతో నరికి చంపారు..

Telugu Akademi Scam Updates : రూ.90 లక్షలతో ఓ ఫ్లాట్‌ కొన్నా... రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.