అక్రమ మద్యం ఉందన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీ నగర్లోని ఓ ఇంట్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో దాదాపు రూ.20 వేల విలువైన.. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 125 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ బెల్ట్ షాప్ను నిర్వహించే రేఖా బాయ్(35), ఆశిష్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కుల్సుంపూరా పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: వైరల్: ఎమ్మెల్యే తమ్ముడినంటూ హంగామా..!