మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేటకు చెందిన రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు.... మంత్రుల వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసాలకు పాల్పడుతున్నాడని వివరించారు. వెబ్‌సైట్లలో కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్ నంబర్ల సేకరించేవాడని... అనంతరం వారి నుంచి డబ్బులు వసూలు చేశాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి 10 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
దాదాపు 9 కంపెనీల నుంచి సుమారు 40 లక్షలు తీసుకున్నాడని వెల్లడించారు. గతంలో నాగరాజుపై హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు నమోదైనట్లు అంజనీ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: మేడారం జాతరలో చోరులు.. 13 సెల్ఫోన్లు స్వాధీనం