ETV Bharat / crime

నకిలీ పదార్థాలు విక్రయిస్తున్న ఏడుగురు ముఠా అరెస్టు - తెలంగాణ వార్తలు

సుగంధ ద్రవ్యాల్లో వాడే ఆంబర్‌ గ్రీస్‌ ఉందని మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్​లో అరెస్ట్ చేశారు పోలీసులు. గమ్ లాంటి పదార్థాన్ని చూపి ఈ ముఠా సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తెలిపారు.

నకిలీ పదార్థాలు విక్రయిస్తున్న ఏడుగురు ముఠా అరెస్టు
Hyderabad Saifabad police arrested a gang selling counterfeit amber grease used in spices
author img

By

Published : Jun 17, 2021, 7:05 AM IST

సుగంధ ద్రవ్యాల్లో వాడే ఆంబర్ గ్రీస్ పదార్థం తమ వద్ద ఉందని నమ్మించి.. నకిలీ పదార్థాన్ని అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సామగ్రితోపాటు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

కాలాపత్తర్‌కు చెందిన వ్యాపారి షకీర్ ఆలీతోపాటు షేక్ అలీ, మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ నజీర్, మోహన్‌లాల్ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అతికించేందుకు వాడే గమ్ లాంటి పదార్థాన్ని అంబర్ గ్రీస్‌గా చూపుతూ... లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సులేమాన్ స్టోన్ ఉందని, బ్రిటీష్‌ వారు వినియోగించిన అయస్కాంత ప్లేట్ ఉందని మోసం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: Today Horoscope: నేటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.