ETV Bharat / crime

మైనర్ బాలికకు వేధింపులు.. సంవత్సరం తర్వాత నిందితుడి అరెస్టు

Cyber Cheater Arrested: సామాజిక మాధ్యమాల్లో వివిధ వ్యక్తులు తారసపడటం అంత వింత విషయం ఏమీ కాదు. అయితే ఇక్కడే చాలామంది అమ్మాయిలు బోల్తా పడుతున్నారు. అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయన్న కారణంతో ముక్కూ, మొహం తెలియని వారిని సైతం తమ స్నేహితుల జాబితాలో చేర్చుకుంటున్నారు. అదే కొన్నిసార్లు వారి పాలిట ప్రమాదంగా మారుతుంది. ఓ మైనర్ బాలికకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సంవత్సరం క్రితం ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Cyber Fraud
Cyber Fraud
author img

By

Published : Feb 6, 2023, 6:49 PM IST

Cyber Cheater Arrested: ఆధునిక యుగంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్ట్ చేయడం.. స్నేహితులతో చాటింగ్ చేయడం.. తమ అభిప్రాయాలను పంచుకోవడం.. మొదలైనవి ఈ రోజుల్లో చాలా కామన్. అయితే ఈక్రమంలో కొంతమంది అమ్మాయిలు తమకు తెలియని వ్యక్తులతో సైతం పరిచయాలు ఏర్పరచుకుంటున్నారు. ఈ బంధాలు చివరికి వివిధ నేరాలకు, ఘోరాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు.

నిందితుడు మనోజ్‌
నిందితుడు మనోజ్‌

తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతులను పరిచయం చేసుకొని బెదిరింపులకు దిగుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మనోజ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అశ్లీల వెబ్‌సైట్‌లలో నీలిచిత్రాలు చూసేందుకు అలవాటు పడ్డాడు. దీంతో మనోజ్ యువతులపై కన్నేశాడు.

సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. పలువురు యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలిక అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించింది. ఇన్‌స్టాగ్రామ్ ఎలా హ్యాక్ చేయాలనే విషయాన్ని అంతర్జాలం చూసి నేర్చుకున్న మనోజ్.. మైనర్ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ లింకు పంపాడు. లింకును ఓపెన్ చేసిన సదరు మైనర్ బాలిక.. అందులో అడిగిన వివరాలు నమోదు చేసుకుంటూ వెళ్లింది.

వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్‌ చేసి బాలిక ఫోటోలన్నింటిని మనోజ్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. వాటిని మార్ఫింగ్ చేసి.. ఆమెను బెదిరించాడు. నగ్నంగా వీడియో కాల్ చేయకపోతే మార్ఫింగ్ చేసిన వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక మైనర్ బాలిక వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితుడు ఏడాది కాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. నిందితుడు మనోజ్ తన స్వగ్రామంలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న సైబర్ క్రైం పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు.. పంపినా, ఏమైనా లింకులు పంపినా ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: నమ్మినవాళ్లు మోసం చేశారని.. బీజేపీ నేత ఆత్మహత్య

కలిసి ఉండటం ఇష్టం లేక భర్తపై ఆరోపణలు.. కూతురితో సంబంధం పెట్టుకున్నాడని..

రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్​ను ఎత్తుకెళ్లిన దొంగలు.. అధికారుల అండతోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.