మణప్పురం బంగారం రుణాల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. ఒడిశా-భువనేశ్వర్‌లోని ఖాందగిరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వయస్సు 20 నుంచి 23 మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రూ.30 లక్షల విలువైన బంగారం కాజేసినట్లు వెల్లడించారు. వీరంతా కాలేజీ విద్యార్థులని చెప్పారు.
ఒడిశా నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ యువకులు.. మణప్పురం రుణాల పేరుతో ఇంటింటికి వెళ్లి మాయమాటలు చెప్పేవారు. బ్యాంక్‌కు వెళ్లనవసరం లేకుండా ఇంటి వద్దే ఈజీ లోన్ ఇప్పిస్తామని నమ్మబలికేవారు. బ్యాంక్ చుట్టు రోజుల తరబడి తిరిగే ఓపిక లేని కొందరు.. వీరి వలలో పడిపోయారు. ఈ యువకులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. అమాయకులకు ఎర వేసి వారి నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. ఎన్ని రోజులైనా రుణం మంజూరు కాకపోవడంతో మోసపోయామని గ్రహించి వారు మా వద్దకు రావడంతో అసలు గుట్టు బయటపడింది.
- సైబర్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్
- ఇదీ చదవండి : Cyber crime: వలపు వల.. చిక్కారో జేబు గుల్ల
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఎట్టకేలకు ఒడిశాలోని ఖాందగిరిలో వీరిని గుర్తించారు. భువనేశ్వర్‌లోని భరత్పూర్ పోలీసుల సాయంతో నిందితులను అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్‌కు తరలించారు.
- ఇదీ చదవండి : ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే మోసపోయినట్టే!
నిందితులు.. దెబాశిశ్ నాయక్ ఓజా(20), ఆదిత్య నారాయణ మహాపాత్ర(22), సౌమ్య రాజన్ పట్నాయక్(21), ప్రమోద్ నాయక్(23), లక్ష్మీధర్ ముర్ము(20).. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.