ETV Bharat / crime

CP Anjani kumar: జోకర్‌ మాల్‌వేర్‌ ఓపెన్ చేస్తే అంతే సంగతులు - joker malicious malware app

సైబర్​ నేరగాళ్లు రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు. కొత్తగా జోకర్​ మలిషియస్​ మాల్​వేర్​తో యువత నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ యాప్​ను గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి పలుమార్లు తొలిగించినా వేర్వేరు పేర్లతో మాల్​వేర్​ను ప్రవేశపెట్టి అమాయకులను మోసం చేస్తున్నారని సీపీ వెల్లడించారు.

joker malicious malwear
జోకర్‌ మలిషియస్‌ మాల్‌వేర్‌
author img

By

Published : Jun 16, 2021, 6:07 PM IST

సైబర్‌ నేరగాళ్లు జోకర్‌ మలిషియస్‌ మాల్‌వేర్‌తో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ముంబయిలో మూడు నెలలుగా ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగాయని... వందల సంఖ్యలో యువత జోకర్ మాల్​వేర్ వల్ల డబ్బులు కోల్పోయారని అంజనీ కుమార్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్‌ చేయవద్దని సూచించారు.

ఆన్‌లైన్‌ కోర్సులు, తరగతులు, ఇతర అవసరాల కోసం విద్యార్థులు, యువత ఇంటర్‌నెట్‌ వాడుతున్నారని... అలాంటి వారు మాల్‌వేర్‌ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ అన్నారు. అంతర్జాలాన్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా అనవసర లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.

జోకర్‌ మలిషియస్‌ మాల్‌వేర్‌తో సైబర్‌ మోసాలు

ఇదీ చదవండి: ETV Bharath Effect: చేవెళ్ల ఎంపీ సాయం.. తీరింది రైతు కష్టం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.