కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష పడింది. 2016 సెప్టెంబర్ 19న నమోదైన కేసులో నాలుగేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కరీంనగర్‌లోని పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి కృష్ణ ఈ తీర్పు వెలువరించారు.
అత్యాచారానికి పాల్పడిన కుమార్(24)కు పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానాను నిందితునికి విధించారు.