భార్యాభర్తల (wife and husband) గొడవల్లో పిల్లల.. ప్రాణాలు పోతున్నాయి. ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా.. బాధ వచ్చినా.. కొందరు తమ పిల్లలనే (kids) నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తున్నారు. ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలైనా సరే.. వాటికి పరిష్కారం వెతకుండా వాళ్లు బలవన్మరణానికి పాల్పడుతూ.. అభం శుభం ఎరుగని చిన్నారులను సైతం హత్య చేస్తున్నారు.
ఇలాంటి ఓ గొడవ.. ఇద్దరు పసిబిడ్డల పాలిట మృత్యుపాశమైంది. భార్యతో గొడవపడిన ఆ భర్త.. తన పిల్లలపాలిట మృత్యువులా మారాడు. కోపంతో ఇద్దరు పసి బిడ్డలను బండకేసి కొట్టాడు. ఈ దారుణమైన ఘటనలో.. రెండేళ్ల పసి పాప అక్కడికక్కడే మరణించగా.. ఐదేళ్ల వయసున్న మరో పాప.. తీవ్ర గాయాలపాలైంది. ఆంధ్రప్రదేశ్ (ap) విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడి వలసలో ఈ ఘాతుకం జరిగింది.
- ఇదీ చూడండి: MURDER : నాన్నే.. ఆయువు తీశాడు
''నాన్న... నేను అమ్మ కడుపులో పడినప్పుడు ఆనంద పడి ఉంటావు. ఎప్పుడు నన్ను చూస్తానా అని మాసాలకొద్దీ వేచి చూసుంటావు. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా భరించింది.. మరి నువ్వు ఎందుకు ఇలా చేశావు నాన్న. నన్ను ఎందుకు కన్నావు. ఇప్పుడు నన్నెందుకు ఇలా నేలకేసి కొట్టావు..!''
-చిన్నారి ఆవేదన
ఏం పాపం చేశానని ఇలా నేలకేసి కొట్టావు.’ అంటూ అభం శుభం తెలియని ఆ పసికందు అంతరాత్మ ఘోషిస్తోంది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి.. ఆ క్రూర తండ్రి కిరాతకంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని ప్రసాద్‌గా గుర్తించిన పోలీసులు.. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: DEAD BODY: నేనేం పాపం చేశానమ్మా?