ETV Bharat / crime

కుటుంబకలహాలతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్​ పోసి నిప్పంటించిన ఘటన నిర్మల్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

భార్యకు నిప్పంటించిన భర్త
భార్యకు నిప్పంటించిన భర్త
author img

By

Published : Apr 20, 2021, 4:47 AM IST

నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు నలభై శాతం కాలిన గాయాలతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

నిజామాబాద్ జిల్లా ఎర్గట్లా గ్రామానికి చెందిన శ్రావణికి సోన్​ మండల కేంద్రానికి చెందిన సతీశ్​తో 2014లో వివాహం జరిగింది. సంవత్సరం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. కొద్దిరోజుల తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్య శ్రావణితో పాటు ఇద్దరు కుమారులపై సతీశ్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తల్లి ఇద్దరు కుమారులను పక్కకు నెట్టేయడంతో పిల్లలు తప్పించుకున్నారు. శ్రావణి అరుపులతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి వేసి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భర్త సతీశ్​, అత్త గంగా నర్సులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ ఉపేందర్​రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: వాచ్​మెన్​పై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.