ETV Bharat / crime

భార్యపై అనుమానంతో పైపుతో దాడి.. చివరికి మృతి - husband murdered wife in rudraram village

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. భార్య తరచూ ఫోన్​లో మాట్లాడుతోందని ఆవేశంతో ఆమెను విచక్షణారహితంగా కొట్టి చంపాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

husband murdered wife
భార్యను చంపిన భర్త
author img

By

Published : May 6, 2021, 8:20 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య తరచూ ఫోన్​లో మాట్లాడుతుండటం చూసి అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను హతమార్చాడు. గ్రామానికి చెందిన స్వప్న, సురేష్​ భార్యాభర్తలు. స్వప్న పలుమార్లు ఫోన్​లో మాట్లాడటాన్ని గమనించిన సురేష్​.. విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలిపాడు.

సోమవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆమె ఫోన్​లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. తీరు మారకపోయేసరికి ఆగ్రహంతో పైపుతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె తీవ్రంగా గాయపడగా బంధువుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: మద్యం తాగి రోడుమీదికొచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.