ETV Bharat / crime

రెండో భార్య దారుణ హత్య.. లొంగిపోయిన నిందితుడు - భార్యను చంపిన భర్త

wife murder
జూబ్లీహిల్స్​లో దారుణ హత్య
author img

By

Published : Jun 6, 2022, 2:21 PM IST

Updated : Jun 7, 2022, 3:05 PM IST

14:13 June 06

wife murder in jublilee hills: భార్యను చంపి డ్రమ్ములో పెట్టి దుస్తులు కప్పిన భర్త

wife murder in jubilee hills: ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్యను హీటర్‌తో కొట్టి చంపిన వ్యక్తి.. ఆ కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చాడు. ఏడాదిలోపే మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తొమ్మిది నెలలు తిరక్కముందే డంబెల్‌తో కొట్టి చంపి.. డ్రమ్ములో కుక్కి పరారయ్యాడు. జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో ఈ దారుణం జరిగిది.

లొంగిపోయిన నిందితుడు..: భార్యను హత్య చేసిన నిందితుడు అనిల్​ కుమార్​ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గురువారం భార్య సరోజను హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి పారిపోయాడు. రెండేళ్ల క్రితం మొదటి భార్య అనితను హత్య చేసిన నిందితుడు.. ఏడాది క్రితమే సరోజను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మల్క్‌మియాన్‌పల్లి గ్రామానికి చెందిన ముదావత్‌ భీముడు హైదరాబాద్‌ హఫీజ్‌పేట ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె సరోజ(21) కొత్తగూడలోని ఓ మాల్‌లో పనిచేసేది. పూల అలంకరణ చేసే అనిల్‌కుమార్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల సమక్షంలో తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి దంపతులు రహమత్‌నగర్‌ డివిజన్‌ సుభాష్‌ చంద్రబోస్‌నగర్‌లో కాపురం ఉంటున్నారు. భర్తకు తనకంటే ముందే మరొకరితో వివాహమైనట్టు, నలుగురు పిల్లలున్నట్టు కొంతకాలం క్రితం సరోజకు తెలిసింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య ఆ విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త తనను తీవ్రంగా కొట్టినట్టు సరోజ ఈ నెల 1న తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పింది.

2వ తేదీ నుంచి ఫోన్‌ చేస్తున్నా కుమార్తె స్పందించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆదివారం ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం మరోసారి ఇంటికి వెళ్లారు. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లో వెతకగా నీళ్ల డ్రమ్ములో సరోజ మృతదేహం కనిపించింది. ‘నిందితుడు డంబెల్‌తో కొట్టి భార్యను హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి పరారయ్యాడు. సోమవారం రాత్రి లొంగిపోయాడు’ అని ఎస్‌ఐ దాలినాయుడు తెలిపారు. ‘2009లో అనిల్‌కుమార్‌ అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లలు పుట్టాక అదనపు కట్నం కోసం వేధించాడు. 2020, మే 30న భార్యను కరెంటు హీటర్‌తో కొట్టి, తలను గోడకేసి మోది చంపాడు. ఆ కేసులో రిమాండ్‌లో ఉండి ఏడాది క్రితం బెయిల్‌పై వచ్చాడు’ అని ఎస్‌ఐ తెలిపారు.

.

అనుమానంతోనే..: సరోజపై అనుమానం పెంచుకున్న అనిల్‌ పలుసార్లు ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు సరోజను గదిలో పెట్టి తాళం వేసుకుని వెళ్లేవాడు. గతంలోనూ మద్యం సేవించి సరోజ చేతి విరగొట్టడంతోపాటు తలపై కటింగ్ ప్లేయర్‌తో బాదాడు. ఈ కేసులో నిందితుడు అనిల్​కుమార్​ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

.

ఇవీ చదవండి : జూబ్లీహిల్స్​ గ్యాంగ్​రేప్​... సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్

'మీలా మతోన్మాదులకు స్మారకాలు కట్టట్లేదు'... పాక్​పై భారత్ ఫైర్

Last Updated : Jun 7, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.