ETV Bharat / crime

WIFE MURDER: కోపంలో చంపేశాడు... పోలీసుల ఎదుట లొంగిపోయాడు - యాదాద్రిలో మహిళ హత్య

ఓ జంటకు కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవ జరిగి మాట మాట పెరిగింది. కోపోద్రిక్తుడైన భర్త... భార్య గొంతు నులిమి అక్కడికక్కడే చంపేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.

WIFE MURDER
కోపంలో చంపేశాడు
author img

By

Published : Aug 23, 2021, 12:17 PM IST

కుటుంబ కలహాలతో భర్త , భార్యను హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక అర్బన్ కాలనీలో వెంకటచారి, లక్ష్మి నివాసముంటున్నారు. వెంకటచారి పట్టణంలోని మమత ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా... లక్ష్మి అదే కాలనీలోని ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తుంది. వీరికి 8 సంవత్సరాల కొడుకు ఉన్నాడు.

ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్య భర్తలు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో... వెంకటాచారి కోపోద్రిక్తుడై... లక్ష్మి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవ పరీక్ష నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి మృతురాలిని తరలించారు. లక్ష్మి మృతితో అర్బన్​ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎనిమిదేళ్ల కొడుకు భవిష్యత్​ని తలచుకొని మృతురాలి బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇదీ చూడండి: suicide: అన్న రాఖీ కట్టించుకోలేదని సోదరి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.