రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధి హైదర్షాకోట్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చాడు.
బసప్ప, పద్మమ్మలు దంపతులు. హైదర్షాకోట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భర్త బసప్ప పద్మమ్మను దారుణంగా హత్యచేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోతుండగా.. స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న పద్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బసప్ప గతంలోనూ రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.