Husband committed suicide by jumping from the building: హైదరాబాద్ శివారు నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. భార్య చూస్తుండగానే భర్త భవనం పైనుంచి దూకేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం రేవన్ సిద్ధప్ప అనే వ్యక్తికి తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది.
ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురైన రేవన్ సిద్ధప్ప.. ఒక్కసారిగా భవనం పైనుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవన్ మృతిచెందాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: