ETV Bharat / crime

భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త - husband chopped his wife to death with a Hunting scythe news

ఓ అనుమానం... నిండు జీవితాన్ని బలి తీసుకుంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్త.. ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానంతో వేట కొడవలితో నరికి చంపాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

husband chopped his wife to death with a Hunting scythe, madhavpur
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
author img

By

Published : May 2, 2021, 2:14 PM IST

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం మాధవాపూర్​లో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి భర్త.. భార్యను వేటకొడవలితో నరికి చంపాడు. మాధవాపూర్​కు చెందిన ఆంజనేయులు, లక్ష్మి భార్యభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో ఆంజనేయులు తన ముగ్గురు పిల్లలతో కలిసి తాండూర్​లో ఉంటున్నారు. భార్య లక్ష్మి మాధవాపూర్​లోనే ఉంటోంది.

ఆంజనేయులు, తన పెద్ద కుమారుడు తాండూరులో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. భార్య లక్ష్మిపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు.. శనివారం రాత్రి మాధవాపూర్​కు వచ్చాడు. తనతో తెచ్చుకున్న వేటకొడవలితో లక్ష్మిపై దాడి చేసి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆంజనేయులుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: అగ్ని ప్రమాదం.. సుమారు 15 లక్షల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.