ETV Bharat / crime

Husband Kills Wife: పక్కా ప్రణాళికతో చంపేశాడు.. విచారణలో దొరికిపోయాడు.. - క్రైమ్ వార్తలు 2021

కట్టుకున్న భార్యను ప్రాణం పోయేదాకా కొట్టాడు (Husband brutally Kills his Wife ).. ఇంకా ఊపిరి ఉందనే అనుమానంతో తాడుతో గొంతుకు ఉరి (Husband brutally Kills his Wife ) వేశాడు. మృతదేహాన్ని బూడిద చేయాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. గుండెపోటుతో మృతి చెందిందని నమ్మించే యత్నం చేసి చివరకు అడ్డంగా దొరికి పోయిన ఘటన ఉప్పల్‌ ఠాణా పరిధిలో గత నెల 29న జరిగింది.

Husband Kills Wife
భార్యను ప్రాణం పోయేదాకా కొట్టాడు
author img

By

Published : Oct 7, 2021, 7:15 AM IST

Updated : Oct 7, 2021, 10:48 AM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలకు చెందిన చిత్తలూరు శ్రీనివాస్‌, సురాంభ(35) దంపతులు. 18 ఏళ్ల క్రితం రామంతాపూర్‌ వచ్చి శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం వరకు శ్రీనివాస్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు(ఇంటర్‌), కుమారుడు(9వ తరగతి) ఉన్నారు. శ్రీనివాస్‌ కొంతకాలంగా ఇంట్లో సక్రమంగా పని చేయకపోగా ఇతరుల వద్ద డబ్బులు అప్పు తెస్తూ తన పరిచయస్థులకు ఇస్తున్నాడు. దీంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికొచ్చి ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. చనిపోలేదని గుర్తించి... కొన ఊపిరితో ఉన్న ఆమె మెడకు ఉరి వేసి (Husband brutally Kills his Wife ) చంపేశాడు. గుండెపోటుగా చిత్రీకరించాలనుకుని... చివరికి దొరికిపోయాడు.

ఇంట్లో పిల్లలకు తెలియకుండా..

శ్రీనివాస్‌ సురాంభను పథకం ప్రకారమే హత్య చేసినట్లు అర్థమవుతోంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు పడుకున్న తర్వాత అనుమానం రాకుండా చంపాడు. అదే రాత్రి మృతదేహాన్ని తన టాటా ఏసీ ఆటోలో వేసుకొని ఊరికి బయలు దేరాడు. ఆ సమయంలో అర్ధరాత్రి దాటాక పిల్లలకు మేలుకొచ్చి ఫోన్‌ చేస్తే కూరగాయల కోసం వెళ్తున్నట్లు చెప్పి నమ్మించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహంపైన, చుట్టూ కూరగాయల ఖాళీ డబ్బాలు పెట్టాడు.

రామంతాపూర్‌ నుంచి బయలు దేరి వెళ్లే మార్గంలో 12 పోలీస్‌స్టేషన్లను దాటుకొని పస్తాలకు చేరుకున్నాడు. పణిగిరి గుట్టల్లోనే మృతదేహాన్ని కాల్చివేద్దామనుకుంటే అప్పటికే తెల్లారడంతో పధకం బెడిసి కొట్టింది. తప్పని పరిస్థితిలో గ్రామానికి చేరుకొని గుండెపోటుతో మృతి చెందిందని (Husband brutally Kills his Wife ) నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించిన బంధుమిత్రులు నాగారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కథ (Husband brutally Kills his Wife )వెలుగులోకి వచ్చింది. వారు కేసు నమోదు చేసుకొని ఉప్పల్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. తదుపరి విచారణ ఇక్కడి పోలీసులు కొనసాగిస్తున్నారు.

ఇవీ చూడండి: Husband killed his wife: భార్యను చంపేశాడు.. సహజ మరణంగా చిత్రీకరించాడు!

విడాకుల నోటీసు పంపిందని.. భార్య, అత్త, మరదలి హత్య!

భర్త వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక తనువు చాలించిన భార్య.!

Husband murdered his wife: భార్య గర్భం దాల్చిందని గొంతు నులిమి చంపిన భర్త

సోషల్​ మీడియా ఎఫెక్ట్​: భర్త పళ్లు రాలగొట్టిన భార్య!

Acid Attack: అనుమానమే పెనుభూతం- భార్యపై యాసిడ్​ దాడి

Last Updated : Oct 7, 2021, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.