Suicide attempt at prajavaani: ఆరోగ్య సమస్యలు ఎంతకు నయం కాకపోవడంతో విసిగి చెందిన వనపర్తి జిల్లా వేసారిన కొత్తకోట మండలం పామాపురానికి చెందిన ఖాజా దంపతులు ప్రజావాణిలో తమను ఆదుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చారు. గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో ఆసుపత్రులు తిరిగి లక్షలు ఖర్చు చేసుకున్న వ్యాధులు నయం కాలేదని తమకు ఆర్థిక సహాయం చేసి చేయూతనివ్వాలని కోరారు.
అందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ తమ ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు సహకరిస్తామని ఏదైనా పని చేసుకుంటే అందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తామని సూచించారు. ఎలాంటి పని చేయటానికి శరీరం సహకరించదని ఆర్థిక సహాయం అందించాలని లేదంటే తమకు మరణమే శరణమని తమ వెంట తెచ్చుకున్న మందు డబ్బాలను బయటకు తీయడంతో అక్కడున్న పోలీసులు వారి నుంచి మందు డబ్బాలను లాగేసుకున్నారు.
అనంతరం కలెక్టర్ ముందుగా ఆరోగ్య సమస్యలను బాగు చేసుకోవాలని అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని సముదాయించి.. వెంటనే పరీక్ష నిర్వహించి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. దీంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యులు వైద్య పరీక్షలు చేయించారు. తనకు తన భార్యకు గత ఏడు సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కన్నీటి పర్యంతమయ్యారు.
ఏ పని చేయాలన్నా తమ వద్దకు ఎవరూ రారని ఉన్న ఇద్దరు పిల్లలను బ్రతికించుకునేందుకు ఆర్థిక సహాయం చేయమని అడిగేందుకు కలెక్టరేట్‌కు వచ్చామని ఖాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు సహాయ సహకారాలు అందిస్తే నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటానని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: