ETV Bharat / crime

తిరుపతి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల.. 12 తులాల బంగారం, 24 తులాల వెండి సహా..! - మేడ్చల్‌లో భారీ చోరీ

Theft in Medchal: దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లి.. తిరిగి వచ్చేలోపు ఇంటిని గుల్ల చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 24 తులాల వెండితో పాటు కొంత నగదును దొంగలు దోచుకెళ్లారు. ఫిర్యాదు చేయడం తప్ప ఏమీ చేయలేని బాధిత యజమాని పోలీసులను ఆశ్రయించాడు.

Theft
Theft
author img

By

Published : Oct 9, 2022, 2:16 PM IST

Theft in Medchal: హైదరాబాద్ నగరంలో దసరా పండుగ వేళ దొంగలు అనుకున్నంత పని చేశారు. దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లి.. తిరిగి వచ్చేలోపు గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, 24 తులాల వెండితో పాటు కొంత నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బండ్లగూడలో చోటుచేసుకుంది.

బండ్లగూడలో నివాసం ఉండే శ్రవణ్‌కుమార్ దసరా సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. వెళ్లే ముందు కష్టపడి పైసాపైసా కూడబెట్టి సంపాదించిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు కొంత డబ్బు బీరువాలో దాచి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు.. ఇంట్లో ఎవరూ లేనిది చూసి తాళాలు పగులగొట్టి దొరికిన కాడికి దోచుకెళ్లారు.

తిరుపతి నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వచ్చిన వారికి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం కనిపించింది. తమ ఇంట్లో దొంగలుపడ్డారని అర్థమైన వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, క్లూస్ టీంను రంగంలోకి దింపారు. బీరువాలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, 24 తులాల వెండితో పాటు కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.