ETV Bharat / crime

ఫంక్షన్​కు వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల.. కాపలాదారే కన్నం వేశాడు..

కాపలాగా పెట్టుకున్న వాడే ఇంటికి కన్నం వేశాడు. నమ్మకంగా పనిచేసిన వాడే.. నట్టేట ముంచాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన దుర్బుద్ధిని చూపాడు. ఉన్నదంతా ఊడ్చేసి ఉడాయించాడు. ఫిర్యాదు చేయడం తప్ప ఏమీ చేయలేని బాధిత యజమాని పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే..?

కాపలా ఉన్న ఇంటికే కన్నం వేశాడు.. భారీగా చోరీ చేసి ఉడాయించాడు

author img

By

Published : Jul 13, 2022, 10:56 AM IST

Updated : Jul 13, 2022, 11:19 AM IST

ఫంక్షన్​కు వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల.. కాపలాదారే కన్నం వేశాడు..

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్​లో భారీ చోరీ జరిగింది. వడ్డేపల్లి దామోదర్​రావు అనే వ్యక్తి ఇంట్లో పనిచేసే వాచ్​మెన్​.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ.35 లక్షల నగదు, రూ.25 లక్షల విలువ చేసే బంగారు నగలతో ఉడాయించాడు.

చోరీకి పాల్పడిన నిందితులు
చోరీకి పాల్పడిన నిందితులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి దామోదర్ రావు ఇంట్లో చక్రధర్ అనే నేపాలీ.. తన భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి 8 నెలల క్రితం వాచ్​మెన్​గా చేరాడు. అప్పటి నుంచి నమ్మకంగా పని చేసుకుంటున్నాడు. ఈ నెల 6న తమ బంధువుల ఇంటికి వెళ్తున్నామని చెప్పి.. కుటుంబంతో కలిసి నాగ్​పూర్ వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో వారితో పాటు ఓ గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చారు.

మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దామోదర్ రావు కుటుంబసమేతంగా కొంపల్లిలో ఓ ఫంక్షన్​కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన చక్రధర్, అతని వెంట వచ్చిన గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రూ.35 లక్షల నగదు, రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని కుటుంబంతో సహా పరారయ్యారు.

ఇంటికి తిరిగి వచ్చిన దామోదర్​రావు.. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు లక్డీకపూల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Last Updated : Jul 13, 2022, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.