ఏపీలోని విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ఘటనలో 20 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మెంటాడ మండలం జక్కువలసలోని కోట పోలినాయుడు ఇంట్లో గ్యాస్ లీకై(gas leak) ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత క్రమంగా మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. పరిసరాల్లో ఉన్నవన్నీ పూరి గుడిసెలు కావటం వల్ల.. చూస్తుంన్నంతలో అన్ని ఇళ్లు మంటల్లో కాలిపోయాయి.
పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సిలిండర్ పేలుళ్ల భయంతో ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
బాధితులను ఆదుకుంటాం..
అగ్నిప్రమాద వార్త తెలియగానే జిల్లా కలెక్టర్ సూర్యకుమారి.. ఘటనపై అధికారులను ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం.. మంటలు అదుపులోకి వచ్చినట్లు సూర్యకుమారి తెలిపారు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు స్థానిక పాఠశాలలో వసతి కల్పించామన్నారు. అగ్నిప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: