ETV Bharat / crime

స్విగ్గీ డెలివరీ బాయ్‌పై రాడ్లు, కర్రలతో హోటల్‌ సిబ్బంది దాడి

hotel staff assaulted on swiggy delivery boy
స్విగ్గీ డెలివరీ బాయ్‌పై హోటల్‌ సిబ్బంది దాడి
author img

By

Published : Jun 4, 2022, 2:10 PM IST

Updated : Jun 4, 2022, 5:32 PM IST

13:22 June 04

గచ్చిబౌలిలో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై 20 మంది హోటల్‌ సిబ్బంది దాడి

స్విగ్గీ డెలివరీ బాయ్‌పై రాడ్లు, కర్రలతో హోటల్‌ సిబ్బంది దాడి

Attack on Swiggy Delivery Boy: కస్టమర్‌ ఆర్డర్ చేసిన ఫుడ్‌ను పరిమిత సమయంలోగా అందించడం డెలివరీ బాయ్ పని. ఆలస్యమైతే.. అటు కంపెనీ నుంచి ఇటు కస్టమర్ల నుంచి నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ తప్పదు. కానీ ఈ విషయం అర్థం చేసుకోని ఓ హెటల్‌ సిబ్బంది అతనిపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారు. ఫుడ్‌ ఆలస్యంపై అడిగినందుకు రాడ్లు, కర్రలతో దాడి చేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో ఓ హోటల్‌ యాజమాన్యం దౌర్జన్యంగా ప్రవర్తించింది. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసింది. ఫుడ్‌ సర్వీస్‌ కోసం డెలివరీ బాయ్‌ అరగంట పాటు హోటల్‌ వద్ద ఎదురుచూశాడు. ఫుడ్‌ ఆలస్యం కావడంతో హోటల్‌ యజమానిని అడిగాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్‌పై యజమానితో సహా హోటల్‌ సిబ్బంది 20 మంది రాడ్లు, కర్రలతో దాడి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన డెలివరీ బాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. డెలివరీ బాయ్‌పై దాడి నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలంటూ హోటల్‌ ముందు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ ఆందోళనకు దిగారు. హోటల్‌ యాజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

''డెలివరీ ఆలస్యం అయిందని బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. మాలో చాలా మందికి గాయాలు అయ్యాయి. రక్తం వచ్చేటట్లు రాడ్లు, కర్రలతో కొట్టారు. డెలివరీ బాయ్‌ అని చూడకుండా దాడి చేశారు. మా వల్ల ఎదిగిన యాజమాని.. ఇప్పుడు మాపైనే దాడికి పాల్పడ్డాడు. కనీసం మానవత్వం లేదు.'' - డెలివరీ బాయ్స్‌

ఇవీ చదవండి: మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారంపై సీబీఐ విచారణ జరిపించాలి: బండి సంజయ్‌

ఆసుపత్రిలోకి చొరబడి వైద్యసిబ్బందిపై కత్తితో దాడి.. పార్టీలో కాల్పుల మోత

Last Updated : Jun 4, 2022, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.