ETV Bharat / crime

honey trappers arrested: వలపు వలతో కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్​ - honey trapping gang

honey trapping gang arrested: తెలిసిన వ్యక్తిలా చాటింగ్‌.... తీయటి మాటలతో డేటింగ్... వలపు వల విసిరి నగ్న వీడియో కాలింగ్...! చివరకు ఆ వీడియోలు వైరల్‌ కావొద్దంటే డబ్బులు కట్టాలంటూ బ్లాక్‌మెయిలింగ్..! వలపు వల విసురుతూ.... నగ్న వీడియోలు సేకరించి నట్టేట ముంచుతున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు ఛేదించారు.

honey trappers arrested
honey trappers arrested
author img

By

Published : Feb 12, 2022, 3:04 AM IST

Updated : Feb 12, 2022, 5:41 AM IST

వలపు వలతో కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్​

honey trapping gang arrested:ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్ వస్తుంది. అంగీకరించగానే... కవ్వించే చాటింగ్‌, తీయటి మాటలతో మాటమాట కలిపి పరిచయాన్ని పెంచుకుంటారు. ఒంపుసొంపులు చూపించి కవ్విస్తారు. నగ్నంగా మాట్లాడుకుందామంటూ వీడియో కాల్‌ చేస్తారు. వలపువల విసిరి... ఎదుటి వ్యక్తిని ఉద్రేకపరుస్తారు. ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసేస్తారు. అవతలి వ్యక్తి ప్యాంటు, చొక్కా విప్పించేలా ప్రేరేపిస్తారు. యువతి మైకంలో పడిపోయి ఇవతలి వ్యక్తీ దుస్తులు విప్పేస్తాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఉన్న తర్వాత మాటల్లోకి దింపుతారు. కాల్ కట్ అయిన తర్వాత ఇవతలి వ్యక్తి వాట్సాప్‌కు వీడియోలు వస్తాయి. తెరిచి చూడగానే తన నగ్నదృశ్యాలు కనిపిస్తాయి....ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.

పరువు పోతుందని ఎంత అడిగితే అంత..

ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో యువకులు... వలపు వలకు చిక్కి కోట్లు పోగొట్టుకున్నారు. చిక్కడపల్లిలో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి 9లక్షలు బదిలీ చేశాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 12లక్షలు సమర్పించుకున్నాడు. అశోక్‌నగర్‌లో ఓ వైద్యుడు ఏకంగా 15 లక్షలు పోగొట్టుకున్నాడు. అందరికీ తెలిస్తే పరువు పోతుందని సైబర్‌ నేరగాళ్లు ఎంత అడిగితే అంత చెల్లిస్తున్నారు.

పన్నెండు రాష్ట్రాల్లో మోస్ట్‌వాంటెడ్‌..

ఇటీవల నగ్నవీడియోలతో తమను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.... నిందితులను అరెస్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు... రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌జిల్లాకు వెళ్లారు. అక్కడ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారు కనీసం పదో తరగతి కూడా పాస్‌ కాలేదని గుర్తించారు. పన్నెండు రాష్ట్రాల్లో వీళ్లు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారని గుర్తించారు. ఆరేడు నెలల్లోనే సుమారు 25కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు. వీడియోలో అసలు యువతి మాట్లాడదని అదంతా సైబర్‌ నేరగాళ్ల మాయని పోలీసులు చెబుతున్నారు.

సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి ఎవరూ డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో తెలియని వ్యక్తుల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్‌ చేయొద్దని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: diploma semester exam paper Leak : డిప్లమా సెమిస్టర్ పరీక్షా పేపర్‌ లీక్​.. వాట్సాప్​లో షేర్

Last Updated : Feb 12, 2022, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.