ETV Bharat / crime

HIZRA MURDER: వేధిస్తోందని హిజ్రాను రోకలి బండతో కొట్టి చంపాడు - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు

ఏపీలోని గుంటూరు వెంకటాద్రిపేటలో దారుణం చోటుచేసుకుంది. తనను వేధిస్తోందని ఓ యువకుడు హిజ్రాను హత్య చేశాడు. హిజ్రా తీరును భరించలేక రోకలి బండతో కొట్టి అంతమొందించాడు.

HIZRA MURDER: వేధిస్తోందని హిజ్రాను రోకలి బండతో కొట్టి చంపాడు

author img

By

Published : Aug 17, 2021, 9:34 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు వెంకటాద్రిపేటలో హిజ్రా హత్య స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి పేటలో నిన్న రాత్రి కోరుకొండ చంద్రశేఖర్ ( 32 ) అలియాస్ చందన అనే హిజ్రాని దుపాటి క్లిమంత్ ( 21) అనే యువకుడు రోకలి బండతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు.

hizra murderHIZRA MURDER: వేధిస్తోందని హిజ్రాను రోకలి బండతో కొట్టి చంపాడు

హిజ్రా చందన, దుపాటి క్లిమంత్ కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల నుంచి యువకుడు తన వద్దకు రావడం లేదని హిజ్రా వేధించడం మొదలుపెట్టింది. వెంటపడి వేధిస్తున్న ఆ హిజ్రా తీరును భరించలేకపోయిన క్లిమంత్.. నిన్న రాత్రి రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం కొత్తపేట పోలీస్​ స్టేషన్​కి వెళ్లి లొంగిపోయాడు.

మృతదేహాన్ని కొత్తపేట పోలీసులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 8 ఏళ్ల బాలుడిని చితకబాదిన ట్యూషన్‌ టీచర్‌... పోలీసులకు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.