ETV Bharat / crime

రాజేంద్రనగర్​లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత - తెలంగాణ వార్తలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్​లో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు సీజ్ చేశారు. డీసీఎంను సీజ్ చేసి డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చంద్రంగుట్టలో కిలో రూ.10 చొప్పున కొని రూ.15కు కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.

pds rice, ration rice seized
పీడీఎస్ బియ్యం పట్టివేత, రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Jun 25, 2021, 9:37 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యాన్ని మెదక్ జిల్లాకు తరలించేందుకు యత్నించారని అధికారులు వెల్లడించారు. డీసీఎం సీజ్ చేసి... డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రంగుట్టలో కిలో రూ.10 చొప్పున తీసుకొని రూ.15కు కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. డ్రైవర్ ద్వారా పూర్తి సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 52 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని కిస్మత్​పూర్​లోని గోదాంకు తరలించి సీజ్ చేసినట్లు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.