గుండెపోటుకు గురైన తన తండ్రి ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో జరిగిన ప్రమాదం తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కింగ్స్ కాలనీకి చెందిన అస్లాంకు శుక్రవారం.. ఇంట్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కారులో తీసుకెళ్తున్నారు. ఆయన కుమారుడు మహ్మద్ కలీల్ కారు నడుపుతున్నాడు.
పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 282 వద్దకు రాగానే కారు బోల్తా కొట్టింది. ఘటన జరిగిన తర్వాత తేరుకున్న కలీల్ కుటుంబ సభ్యులు వేరే కారులో అస్లాంను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అస్లాం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ప్రమాదం, దంపతులు మృతి