ETV Bharat / crime

hashish oil: రూ. 2.4 లక్షల విలువైన హాసిస్​ ఆయిల్​ స్వాధీనం.. ముఠా అరెస్ట్​ - hjyderabad crime news

hashish oil: హైదరాబాద్​లో హాసిస్​ ఆయిల్​ విక్రయిస్తుండగా నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. ఓ ముఠాను అరెస్ట్​చేశారు. వారి నుంచి సుమారు 2.4 లక్షల విలువైన హాసిస్​ ఆయిల్​, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

hashish oil
hashish oil
author img

By

Published : Feb 7, 2022, 5:33 AM IST

hashish oil: హాసిస్​ ఆయిల్​ను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్త్​జోన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 120 చిన్న బాక్సుల్లో ఉంచిన హాసిస్​ ఆయిల్​, ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2,40,000 రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ​

ఏపీలోని అరకు ప్రాంతానికి చెందిన డ్రగ్ ప్లెడర్ కృష్ణ.. రైళ్లలో హాసిస్​ ఆయిల్ అక్రమంగా​ తీసుకొచ్చి.. హైదరాబాద్​లో విక్రయిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్​ పోలీసులు గుర్తించారు. చిలకలగూడకు చెందిన ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి సిగరెట్లలో హాసిస్​ ఆయిల్​ నింపి తాగేవారని గుర్తించారు. తర్వాత వారే నగరంలో విక్రయాలకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. కృష్ణ దగ్గర తక్కువ ధరకు కొని.. హైదరాబాద్​లో ఎక్కువ ధరకు విక్రయించేవారని పోలీసులు గుర్తించారు. వారాసిగూడలో హాసిస్​ ఆయిల్​ విక్రయిస్తుండగా దాడులు చేసి నిందితులను పట్టుకున్నట్లు టాస్క్​ఫోర్స్​ పోలీసులు తెలిపారు. కేసునమోదుచేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

ఇదీచూడండి: Tollywood Drugs: మళ్లీ తెరపైకి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.