ETV Bharat / crime

బ్లూటూత్​తో స్మార్ట్​ఫోన్ హ్యాకింగ్.. జర భద్రం గురూ - smart phones Hacking with Bluetooth

smart phones Hacking with Bluetooth : చేతికి పెట్టుకున్న డిజిటల్‌ వాచీ, చెవులకి ధరించిన ఇయర్‌పాడ్‌ పనిచేయాలన్నా.. కారులో మ్యూజిక్‌ సిస్టమ్‌తో అనుసంధానమవ్వాలంటే బ్లూటూత్‌ ఒక్కటుంటే చాలు. హ్యాండ్‌ ఫ్రీ సాంకేతికతలో భాగంగా కుర్రకారు నుంచి పెద్దల వరకూ వైర్‌లెస్‌ పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీని ఆసరాగా తీసుకున్న సైబర్​ నేరగాళ్లు బ్లూబగ్గింగ్​ పేరిట మోసం చేస్తున్నారు. అది ఎలా అంటే..

Hacking smartphones with bluebugging
బ్లూబగ్గింగ్‌తో స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్‌
author img

By

Published : Feb 1, 2023, 1:14 PM IST

smart phones Hacking with Bluetooth: గత కొంతకాలంగా ఇయర్‌ఫోన్లు, డిజిటల్‌ చేతి గడియారాలు అందుబాటులోకి రావడంతో బ్లూటూత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. దీన్ని సైబర్‌ నేరగాళ్లు తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. బ్లూటూత్‌ ఆన్‌లో ఉండే ఫోన్లు లక్ష్యంగా పంజా విసురుతున్నారు. ‘బ్లూ బగ్గింగ్‌’ పేరిట పిలిచే ఈ హ్యాకింగ్‌ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

బ్లూ బగ్గింగ్‌ అంటే..?: సాధారణంగా ఫోన్‌కు సందేశాల ద్వారా లింకులు, సాఫ్ట్‌వేర్‌లు జోప్పించి హ్యాక్‌ చేస్తుంటారు. బ్లూబగ్గింగ్‌ విధానంలో మాత్రం బ్లూటూత్‌ ఆన్‌లో ఉన్న ఫోన్లను లక్ష్యంగా చేసుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్‌ ఆన్‌లో ఉన్న ఫోన్లతో బ్లూటూత్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపించి అనుసంధానం అవుతారు. తమ బ్లూటూత్‌ పేరును ఎదుటి వ్యక్తులు వినియోగిస్తున్న ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్స్‌ కంపెనీ పేరులా మార్చి కనెక్ట్‌ అయ్యేందుకు రిక్వెస్ట్‌ పంపుతారు.

అది మనదే అని మనం ఒకసారి కనెక్ట్‌ అయితే అంతే. మన ఫోన్‌కు ఎలాంటి సందేశాలు రాకుండా రహస్యంగా కొన్ని రకాల మాల్‌వేర్లను పంపిస్తారు. ఫోన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటారు. మాల్‌వేర్లను పంపించడం ద్వారా కాంటాక్ట్‌, ఫొటోలు, ఇతర కీలక సమాచారం తస్కరించి బెదిరింపులకు దిగుతారు. విదేశాల్లో ఈ అనైతిక పద్ధతుల్ని విరివిగా వినియోగిస్తున్నారు.

ఇవీ జాగ్రత్తలు..!:

  • బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అవసరమైతే తప్ప బ్లూటూత్‌ ఆఫ్‌ చేయాలి.
  • గుర్తుతెలియని పరికరాలు, పరిచయం లేని వ్యక్తులు బ్లూటూత్‌ ద్వారా పంపే పెయిరింగ్‌ రిక్వెస్ట్‌లకు స్పందించకూడదు.
  • అవసరం లేకపోతే అప్పటివరకూ అనుసంధానమైన బ్లూటూత్‌ పరికరాలతో అన్‌పెయిర్‌ చేయాలి.
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రాంతాల్లో ఉచిత వైఫై వినియోగించొద్దు.
  • డేటాలో హెచ్చుతగ్గుల్ని గమనిస్తూ ఉండాలి. అదనపు భద్రతకు వీపీఎన్‌ వాడాలి.

‘సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. బ్లూ టూత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్నో అవకాశంగా తీసుకుని బ్లూబగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. మన దగ్గర ఇలాంటి కేసులు నమోదవకున్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం. సైబర్​ క్రైమ్​కి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి కేసులు మీకు ఎక్కడైనా తారస పడితే మాకు తెలియజేయాలని కోరుతున్నాను’. -జీ శ్రీధర్‌, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.